- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Republic Day celebrations: పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. భారీ బందోబస్తు
by Ramesh Naini |
సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో రేపు ఉదయం 9 గంటలకు గణతంత్ర వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో రేపు ఉదయం 9 గంటలకు గణతంత్ర వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం గవర్నర్ ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు. వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక జిల్లాల కేంద్రాల్లో గణతంత్ర వేడుకలను జిల్లా కలెక్టర్లు నిర్వహించనున్నారు.
కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు జాతీయ జెండాలతో అలంకరించబడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అటు రాజకీయ పార్టీ ఆఫీసుల్లోనూ మువ్వన్నెలు రెపరెపలాడనున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు జాతీయ జెండాలను ఎగుర వేయనున్నారు.
Next Story






