Formula E Car Race : ఏసీబీ విచారణకు నేడు గ్రీన్ కో , ఏస్ నెక్స్ట్ కంపెనీ ప్రతినిధులు

by Y. Venkata Narasimha Reddy |
Formula E Car Race : ఏసీబీ విచారణకు నేడు గ్రీన్ కో , ఏస్ నెక్స్ట్ కంపెనీ ప్రతినిధులు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కారు రేస్ కేసు(Formula E Car Race Case) విచారణలో భాగంగా ఏసీబీ(ACB)అధికారులు నేడు గ్రీన్ కో , ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ(Green Co, Ace Next Gen Company)ప్రతినిధులను విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ను, ఐఏఎస్ అరవింద్ కుమార్(IAS Arvind Kumar), హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌రెడ్డి(Former HMDA Chief Engineer BLN Reddy)లను విచారించిన ఏసీబీ నేడు రేసు నిర్వహణ సంస్థలైన గ్రీన్ కో , ఏస్ నెక్స్ట్ కంపెనీ ఎండీ. అనీల్ కుమార్(MD Anilkumar) సహా ఆ కంపనీ ప్రతినిధులను విచారించనుంది.

మొదటి దఫా రేసింగ్ 9వ సీజన్‌కు నిర్వహణలో పార్ట్నర్ గా కొనసాగి.. రెండో దఫా 10వ సీజన్‌ రేసు నిర్వహణ బాధ్యతల నుంచి ఏస్ నెక్స్ట్ కంపెనీ తప్పుకుంది. దీంతో హెచ్ఎండిఏను పార్ట్నర్ గా చేర్చి.. ఎఫ్ఈఓ సంస్థకు 55 కోట్ల రూపాయల నిధులు బదలాయింపు చేశారు. నాలుగు సీజన్ లకు ఒప్పందం చేసుకున్నా గ్రీన్ కో సంస్థ నష్టాల కారణంగా మధ్యలోనే తప్పుకుంది. 10వ సీజన్ ఏస్ నెక్ట్స్ తప్పుకోవడంతో దాని స్థానంలో హెచ్ఎండిఏ చేరింది. గ్రీన్ కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్ ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఆయనతో-మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సాన్నిహిత్యం సంబంధాలున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది గ్రీన్ కో. ఏస్ నెక్ట్స్ జెన్ మాతృ సంస్థ గ్రీన్ కో కావడం గమనార్హం. ఫార్ములా ఈ కారు రేసులో కీలకంగా ఉన్న గ్రీన్ కో నుంచి తెలుగు రాష్ట్రాలో అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు అందుకున్నాయి. అయితే ఫార్ములా ఈ కారు రేసులో బీఆర్ ఎస్ కు క్విడ్ ప్రోకో కోణంలో ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు అందించినట్లుగా ప్రభుత్వం ఆరోపిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed