ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగిస్తాం.. మంత్రితో నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ

by Ramesh Naini |

ప్రతి నెలా నిధులు విడుదల చేస్తామని, హాస్పిటళ్లు కోరుతున్న ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్య శ్రీ ప్రతినిధులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు.

ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగిస్తాం.. మంత్రితో నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి నెలా నిధులు విడుదల చేస్తామని, హాస్పిటళ్లు కోరుతున్న ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్య శ్రీ (Aarogyasri) ప్రతినిధులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహను భేటీ అయ్యారు. ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని, ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని హాస్పిటల్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపి శాలువ కప్పి సత్కరించారు.

Next Story