ఆ MLA మోసం చేశాడని మహిళ నా దగ్గరకు వచ్చింది.. రిపోర్టర్ శ్యామ్ వివరణ

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-26 12:38:17  IST  )

కామారెడ్డి(Kamareddy) జిల్లా జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు(Thota Laxmi Kantha Rao)కు ఫోన్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడంటూ వస్తోన్న వార్తలపై రిపోర్టర్ శ్యామ్(Journalist Shyam) స్పందించారు.

ఆ MLA మోసం చేశాడని మహిళ నా దగ్గరకు వచ్చింది.. రిపోర్టర్ శ్యామ్ వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి(Kamareddy) జిల్లా జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు(Thota Laxmi Kantha Rao)కు ఫోన్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడంటూ వస్తోన్న వార్తలపై రిపోర్టర్ శ్యామ్(Journalist Shyam) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావును తాను బ్లాక్ మెయిల్ చేసినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. అదంతా అసత్య ప్రచారమని అన్నారు. ‘ఒక మహిళ నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే నన్ను మోసం చేశాడు. మాకు ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పింది. నేను స్వయంగా ఎమ్మెల్యేను కలిసి మీకు ఇబ్బంది కాకుండా చూసుకోండి. రాజకీయాల్లో ఉన్న మీకు పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని ఒక బ్రదర్‌గా ఎమ్మెల్యేను కలిసి వివరించారు. అంతేకాదు.. రూ.5 కోట్లు, రూ.10 కోట్లు అని డిమాండ్ చేయలేదు. అయితే.. నేను చెప్పింది ఎమ్మెల్యే సరిగా అర్ధం చేసుకోకుండా.. ఉల్టా నాపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు’ అని రిపోర్టర్ శ్యామ్ చెప్పుకొచ్చారు. తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే.. ఏం చేయడానికైనా సిద్ధమే అని రిపోర్టర్ శ్యామ్ ప్రకటించారు.

కాగా, జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావుకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ.. రూ.5 కోట్లు ఇవ్వకుంటే అవి బయటపెడతామంటూ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

Next Story