- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక : రైతు కమిషన్
గిరిజన రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రైతు కమిషన్పేర్కొంది. బుధవారం తమ కార్యాలయంలో గిరిజన రైతులు- సాగు సమస్యలపై సమావేశం జరిగింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజన రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రైతు కమిషన్పేర్కొంది. బుధవారం తమ కార్యాలయంలో గిరిజన రైతులు- సాగు సమస్యలపై సమావేశం జరిగింది. సందర్భంగా చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టంలో పేర్కొన్న విధంగా ఆర్ఓఎఫ్ఆర్ రికార్డును రెవెన్యూ రికార్డును అను సంధానం చేయడం ద్వారా చాలా వరకు గిరిజన రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భూ భారతి చట్టాన్ని గిరిజన ప్రాంతంలో అమలు చేయడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, బ్యాంకర్లు కూడా అటవీ హక్కుల రికార్డు ఆధారంగా రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు. ఫారెస్టు సెటిల్మెంట్ ప్రక్రియ త్వరతిగతిన పూర్తి చేయాలి. ఫారెస్టు, రెవెన్యూ గెట్టు సమస్యలు ఉన్నచోట రీసర్వే వెంటనే జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు భూమి సునీల్, రాములు నాయక్, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, చెవిటి వెంకన్న, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి,ఫారెస్ట్ డీసీఎఫ్ రాజారమణ రెడ్డి, సీసీఎల్ఏ, ఐటీడీఏ, ట్రైబల్ వెల్ఫేర్, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, గిరిజన ప్రాంత రైతులు హాజరయ్యారు.
- Tags
- Rythu Commission






