- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: పంచాయతీ ఎన్నికలు.. రిజర్వేషన్లపై కీలక అప్‌డేట్
by Gantepaka Srikanth |
స్థానిక సంస్థల ఎన్నికల(Telangana Local Elections) రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల(Telangana Local Elections) రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా 50 శాతం మించకుండా SC, ST, BC లకు రిజర్వేషన్లు సిఫార్సు చేసింది. దీంతో డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఈనెల 24న హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తి చేయనుంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ సిద్ధమైంది. డిసెంబర్ 20లోపు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పోలింగ్ జరుగనుంది. మరోవైపు.. తెలంగాణలో పాలకవర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలు అవుతోంది. ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులు ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Next Story






