మూతబడిన 138 స్కూళ్ల రీఓపెనింగ్

by Muthe.Rajitha |

విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి.

మూతబడిన 138 స్కూళ్ల రీఓపెనింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. మళ్లీ అక్కడే స్కూళ్లో విద్యార్థులు చేరేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. స్కూళ్లు తెరుచుకోవడంలో సక్సెస్ అయింది. జీరో అడ్మిషన్లతో మూతపడిన స్కూళ్లు పిల్లల రాకతో మళ్లీ కళకళలాడనున్నాయి. విద్యాశాఖ వినూత్న కార్యక్రమాలతో జీరో అడ్మిషన్లతో మూతబడ్డ స్కూళ్లను రీఓపెన్ చేయడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ 138 స్కూళ్లు తెరుచుకున్నాయి. ఈ స్కూళ్లలో 1224 మంది విద్యార్థులు చేరారు.

ఒక్కరే విద్యార్థి:

రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలో దయాల్ బోడు తండా, కొత్తూర్ మండలం అక్కివానిగూడ, మాడ్గుల్ మండలం తోడెలుగుండుతండా, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఒంటిగుడిసెతండా లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క అడ్మిషన్ మాత్రమే నమోదైంది. మూత బడిన పాఠశాలలు రీఓపెనింగ్ చేయడం విషయంలో ప్రభుత్వం సంకల్పం మంచిదే అయినప్పటికీ విద్యార్థుల కోసం టీచర్లా, టీచర్ల కోసం విద్యార్థులా అన్న చందంగా ఉందని పలువురు విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరికోన్ని పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులు మాత్రమే అడ్మిషన్ తీసుకున్నారు. కొన్నింటిలో ముగ్గురు ఉన్నారు. మొత్తంగా చూస్తే పట్టుమని పది విద్యార్థులు కూడా లేని పాఠశాలలు చాలా ఉన్నాయి.

విద్యార్థులు ఎక్కువగా చేరిన స్కూళ్లు వివరాలు

Next Story