- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాచలం ఐదు గ్రామాలు తెలంగాణకే ఇవ్వాలి.. రాజ్యసభలో రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతి చట్టబద్దత బిల్లుపైన గురువారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొని మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ రాజధాని అమరావతి చట్టబద్దత బిల్లుపైన గురువారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొని మాట్లాడారు. అమరావతి చట్టబద్దత బిల్లుకు ఆమె తన సంపూర్థ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి అంశంపైన గతంలో తాను ఓ సందర్భంలో ‘పెట్టరా పేరు అమరావతి..లేకపోతే పిలవరా పేరు కమరావతి’ పేరు పెట్టు అని అన్నట్లుగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు అమరావతి రైతుల విజయమని, 12 ఏళ్ల తర్వాత ఈ బిల్లు రావడం బాధకరమని, పాలసీ పెరాలసిస్ తో ఈ 12 ఏళ్లు ఏపీ నష్టపోయిందని రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. గత సీఎం మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని, రైతులను ఎంత వేధించినా వెనక్కి తగ్గకుండా తమ ఆందోళనను నిర్వహించారరన్నారని, వారు పోరాటాన్ని ఏ జాతీయ మీడియా కూడా కవర్ చేయలేదని విమర్శించారు.
తెలంగాణకు ఇచ్చిన హామీలు?
ఏపీ విభజన హామీలను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని, హామీలను అమలు చేయనందుకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె నిలదీశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను విస్మరించారని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ హామీలను నెరవేర్చలేదని రేణుకా చౌదరి విమర్శించారు. తెలంగాణకు మొండి చెయ్యి చూపిస్తున్నారని, ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని, తెలంగాణలో ఉండాలనుకునే వాళ్లను ఏపీలో కలిపారని ఆమె తెలిపారు. ఆ గ్రామాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన చెందారు. దక్షిణాది రాష్ట్రాలను అవమానిస్తున్నారని, గుజరాత్ నగరాలకు లక్షల కోట్లు కేటాయింపులు చేసుకుంటున్నారని రేణుకా చౌదరి ఆరోపించారు. ఏపీ, తెలంగాణకు మధ్య రూ.లక్షా 42 వేల కోట్ల ఆస్తుల పంపకాలు జరగలేదన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్దిలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.






