కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదంపై రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

కృష్ణా, గోదావ‌రి న‌దీ జ‌లాల వివాదంపై రాజ్య‌స‌భ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నీటి వివాదాల‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని అన్నారు.

కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదంపై రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా, గోదావ‌రి న‌దీ జ‌లాల వివాదంపై రాజ్య‌స‌భ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నీటి వివాదాల‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని ఇద్ద‌రూ ఒక‌చోట కూర్చుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని అన్నారు. వైసీపీ వాళ్లు ఏమైనా చెబుతార‌ని మొరిగే కుక్క‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు.

ఇదిలా ఉంటే తాను కోరడం వల్లనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆపేశాడని రేవంత్ రెడ్డి మాట్లాడటంతో నీటి వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల రాయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోలేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో నీళ్ల పంపకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రశ్నగా మారింది.

Next Story