- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HCU విద్యార్థులకు రేణు దేశాయ్ సపోర్ట్.. నెట్టింట NTR సెన్సేషనల్ డైలాగ్ పోస్ట్
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పార్టీలకు అతీతంగా మద్దతు ఇస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పార్టీలకు అతీతంగా మద్దతు ఇస్తున్నారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలతో పాటు పర్యావరణ వేత్తలు కూడా స్వయంగా వచ్చి విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరోవైపు ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా గొంతు కలుపుతున్నారు. ఇప్పటివరకు కల్కీ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్, విరాటపర్వం డైరెక్టర్ వేణు ఉడుగుల, నటులు ప్రకాశ్ రాజ్, ప్రియదర్శి, నటి ఈషా రెబ్బ మద్దతు ప్రకటించగా.. తాజాగా పవన్ కల్యాణ్ మాజీ భార్య, పర్యావరణ ప్రేమికురాలు రేణు దేశాయ్(Renu Desai) స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం(Janatha Garage Movie)లో ఎన్టీఆర్ డైలాగ్‌ను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. ‘ప్రకృతి మన సొంతం కాదు.. కొన్నాళ్లు ఇక్కడ జీవించానికి మాత్రమే మనం వచ్చాం. ఇదేదీ మన సొంతం కాదు. ఇప్పుడెలా ఉందో అచ్చం అలాగే వచ్చే తరాలకు మనం అందించాలి. దేని మీదా చెయ్యి వేసి చెడదొబ్బకూడదు’ అనే డైలాగ్‌ను రేణు దేశాయ్ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Celebrities who reacted on #SaveHCUBioDiversity Campaign.#SaveHCU #SaveHyderabadBioDiversity pic.twitter.com/20FvzdIFQu
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) April 1, 2025






