- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Goa: గోవాలో హైదరాబాద్ జంటపై దాడి.. ఇలాగే ఉంటే టూరిస్ట్‌లు రావడం కష్టమే!
గోవాలో టూరిస్ట్‌లపై అప్పుడప్పుడు దాడులు జరుగుతున్నాయి. కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం దాడులను కట్టడి చేయడంలో విఫలం అవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: (Goa) గోవాలో టూరిస్ట్‌లపై అప్పుడప్పుడు దాడులు జరుగుతున్నాయి. కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం దాడులను కట్టడి చేయడంలో విఫలం అవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ జంట (Tourist couple)పై గోవాలో దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. సెలవులు రావడంతో గోవాకు వెళ్లిన హైదరాబాద్‌కి చెందిన దంపతులు పనాజీ బస్‌స్టాండ్ సమీపంలో ఒక బైక్‌ను (Rental bike) అద్దెకు తీసుకున్నారు. అనంతరం బైక్ తిరిగి ఇవ్వడానికి వెళ్లినప్పుడు అదనంగా రూ.200 చెల్లించాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. అదనంగా ఎందుకు చెల్లించాలని నిర్వాహకులతో జంట వాగ్వాదానికి దిగింది. వాగ్వాదం కాస్త పెరగడంతో ఘర్షణకు దారితీసింది. నిర్వాహకులు జంటపై దాడికి దిగారు. ఈ ఘటనలో భర్త తలకు గాయాలు కాగా.. గర్భిణి అయిన భార్య ముఖం తీవ్రంగా వాపు వచ్చింది. వెంటనే వారిని గోవా మెడికల్ కాలేజీ (జీఎంసీ)కి తరలించారు.
ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై తన భార్యపై కొంత మంది వ్యక్తులు దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చారు. గర్భవతి అయిన తన భార్యపై కూడా దాడి చేశారని, ఆమె చెంపపై వాపు వచ్చిందని ఈ విషయాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గతంలోనూ అద్దె బైక్ ఛార్జీల విషయంలో ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. ప్రాణనష్టం జరిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. దీంతో గోవాకు వెళ్లే పర్యాటకులు అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగితే గోవాకి ఎవడు రాడని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు.






