CM రేవంత్‌తో ప్రముఖ ఆర్థికవేత్త సుబ్రమణియన్ భేటీ

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

CM రేవంత్‌తో ప్రముఖ ఆర్థికవేత్త సుబ్రమణియన్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు సుబ్రమణియన్ ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ విభాగాల్లో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో పన్నుల అంచనా, తదితర అంశాలపై సుబ్రమణియన్‌తో చర్చించారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకుని ప్రణాళికా బద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు.

Next Story