పారితోషికం వెంటనే చెల్లించాలి.. సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఉద్యోగుల డిమాండ్

by Ramesh Goud |

సమగ్ర కుటుంబ సర్వే (comprehensive family survey) చేసిన ఉద్యోగులకు పారితోషికం (remuneration) వెంటనే చెల్లించాలని ఎన్యూమరేటర్లు (Enumerators), డేటా ఎంట్రీ ఆపరేటర్లు (data entry operators) డిమాండ్ చేస్తున్నారు.

పారితోషికం వెంటనే చెల్లించాలి.. సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఉద్యోగుల డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: సమగ్ర కుటుంబ సర్వే (comprehensive family survey) చేసిన ఉద్యోగులకు పారితోషికం (remuneration) వెంటనే చెల్లించాలని ఎన్యూమరేటర్లు (Enumerators), డేటా ఎంట్రీ ఆపరేటర్లు (data entry operators) డిమాండ్ చేస్తున్నారు. లేని యడల ఎంపీడీఓ కార్యాలయాల (MPDO offices) ముందు ఆందోళన (protest)కు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు కేసముద్రం మండల (Kesamudram Mandal) ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారికి (Praja Parishad Development Officer) ఎన్యూమరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వినతి పత్రం (petition) సమర్పించారు. ఈ సందర్భంగా వారు.. తమ డిమాండ్లను వినతి పత్రం ద్వారా తెలియ జేశారు. 2024 నవంబర్ నెలలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో విధులు నిర్వహించిన ఎన్యూమరేటర్లకు, డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్లకు ఇవ్వవలసిన పారితోషికం వెంటనే ఇవ్వాలని అన్నారు.

అలాగే విధులు నిర్వహించి మూడు నెలలు గడిచినా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని, సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకుని విధులు నిర్వహించిన ఉద్యోగులందరికీ, డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్లందరికీ డబ్బులు వెంటనే ఇప్పించాలని మనవి చేశారు. లేదంటే ఈ నెల 27 వ తేదీ నుంచి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఖాదర్, వెన్ను బిక్షపతి, పత్తిపాక ఉపేందర్, వి వెంకటరమణ, చీర మురళి, బండారు స్వాతి, నేలకొండ నాగవాణి, బానోత్ దేవుసింగ్, ఏ ప్రణీత, ఎస్ అనిత, నేరెళ్ల పద్మ, జి రేవంత్, జి రాజు, జి జస్వంత్, షేక్ అజిత్ లు పాల్గొన్నారు. కాగా గత సంవత్సరం నవంబర్ లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వే డేటా ఎంట్రీ కోసం కొందరు వ్యక్తులను కాంట్రాక్టు పద్దతిన నియమించుకున్నది.

Next Story