Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ పై సుప్రీం స్టే

by Prasad Jukanti |

ఓబుళాపురం కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Srilakshmi:  ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ పై సుప్రీం స్టే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓబుళాపురం మైనింగ్ కేసులో (Obulapuram Mining Case) ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి (IAS Srilakshmi) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్ ను గతంలో కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఓబుళాపురం కేసు నుంచి తప్పించాలంటూ శ్రీలక్ష్మి గతంలో హైకోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌.. సీబీఐ ఆరోపణల్లో ప్రాథమిక ఆధారాలున్నందున కేసును కొట్టివేయలేమని శ్రీలక్ష్మి పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే సీబీఐ అభియోగాలపై సీబీఐ కోర్టులోనే విచారణ ఎదుర్కొని నిరూపించుకోవాలని న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టు ఆదేశాలపై శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించించింది. ఈ కేసులో మరోసారి వాదనలు విని నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సూచించింది.

Next Story