- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు రిలీఫ్
by Prasad Jukanti |
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు ఊరట కల్పించింది .

X
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) హైకోర్టులో ఊరట లభించింది. గతంలో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. 2021 లో ఏఐసీసీ పీలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డిపై సైఫాబాద్ పీఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ కేసు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును (High Court) ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డికి హాజరు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పీపీ నాగేశ్వరరావును ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
Next Story






