తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఊరట

by Muthe.Rajitha |

తెలంగాణ యూనివర్సిటీ (టీయూ)లో అసిస్టెంట్ ప్రోఫెసర్లకు హై కోర్టు ఊరట నిచ్చింది.

తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఊరట
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ యూనివర్సిటీ (టీయూ)లో అసిస్టెంట్ ప్రోఫెసర్లకు హై కోర్టు ఊరట నిచ్చింది. 2012లో జరిగిన నియామకాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాత్కలింకంగా సస్పెండ్ చేస్తూ హై కోర్టు ఛీఫ్ జస్టీస్ అపరేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాలలో అర్హులైన వారిని నియామకాలు చెపట్టాల్సిందిగా ఆదేశాలలో పేర్కోంది. అప్పటి వరకు మద్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని ఆదేశాలలో పేర్కోంది.

2012లో జరిగిన నియామకాలపై రోస్టర్ పాయింట్లు, నిబంధనలు సరిగా పాటించలేదని పేర్కొంటూ, ఆ నియామకాలను హైకోర్టు సింగిల్ బెంచ్ అక్టోబర్ 31వ తేదిన రద్దు చేసింది. యూనివర్సిటీ కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు కారణంగా 45 మంది ప్రొఫెసర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు. హై కోర్టు సింగల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ ఈ నెల 21వ తేదిన హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. తదుపరి విచారణ జనవరి 8వ తేదికి వాయిదా వేసింది.

Next Story