సింగరేణి సీఆర్టీలకు వేసవిలో వేతనాలు చెల్లించాలి

by Naga Rani Yarlagadda |

కాంట్రాక్టు టీచర్లకు పన్నెండు నెలల వేతనాలు అందించాలని సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు.

సింగరేణి సీఆర్టీలకు వేసవిలో వేతనాలు చెల్లించాలి
X
  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సింగరేణి పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు పన్నెండు నెలల వేతనాలు అందించాలని సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతి ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సీఆర్టీలు కేవలం పది నెలల వేతనాలు మాత్రమే పొందుతూ ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారి సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందిస్తూ వెంటనే వారిని తిరిగి విధులలో చేరే విధంగా ఉత్తర్వులు ఇస్తామని సీఎండీ తెలిపారని శ్రీపాల్ రెడ్డి అన్నారు. వారికి కనీస వేతనం చెల్లింపు పై కూడా హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ తెలిపారు. అదేవిధంగా సింగరేణి ఆసుపత్రులతో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో వారికి ఉచిత వైద్యం అందించాలని కోరారు. సీఎండీ ని కలిసిన వారిలో పీఆర్టీయూ ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఉన్నారు.

Next Story