- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల ఫేజ్-1 కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించుకున్న అభ్యర్థులకు రిపోర్టింగ్ గడువును మరో రెండు రోజులు పొడిగించింది. ఈ నెల 14, 17 డిసెంబర్ తేదీల్లో జారీ చేసిన నోటిఫికేషన్లకు కొనసాగింపుగా అసలు గడువు అయిన డిసెంబర్ 21 సాయంత్రం 4 గంటలకు ఉన్న రిపోర్టరింగ్ తేదీని డిసెంబర్ 23 సాయంత్రం 4 గంటల వరకు పెంచినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. అభ్యర్థులు కేటాయించబడిన కళాశాలకు అవసరమైన సర్టిఫికెట్లు, బాండ్లు, ఫీజులతో కలిసి తప్పనిసరిగా గడువు ముగిసేలోపు హాజరుకావాలని సూచించింది. లేనిపక్షంలో వారి అలాట్‌మెంట్ రద్దవుతుందని స్పష్టం చేసింది. అలాగే రిపోర్ట్ అయిన అభ్యర్థుల వివరాలను అదే రోజు 23వ తేదీ సాయంత్రం 4.30 వరకు యూనివర్శిటీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కాలేజీ ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.






