ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులకు రిలీఫ్‌..ఇక‌పై ప్రతి వారం బిల్లులు !

by velandi.Saikiran |

లంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ పై బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులకు రిలీఫ్‌..ఇక‌పై ప్రతి వారం బిల్లులు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇందిర‌మ్మ ఇండ్ల‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏ కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండరాదని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు భట్టి. తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ పై బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. త్వర త్వరగా ఇళ్లను నిర్మించుకోవాలని ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులకు విజ్ఞప్తి చేస్తున్నాన‌ని వివ‌రించారు. ప్రతి వారం అందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వానిది అంటూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

అర్హులైన వాళ్ల‌కు ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం తమ సర్కార్ తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలను ప్రతిపక్షాలు కావాలనే విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు వర్తించేలా లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తామని కీలక ప్రకటన చేశారు. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతా లభిస్తుందని భీమా వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. ఇప్పటివరకు ఉన్న పరిమితులను తొలగించి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని వివరించారు.

Next Story