- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Relief: హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. గచ్చిబౌలి పీఎస్‌లో నమోదైన కేసు కొట్టివేత
తెలంగాణ హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Telangana High Court) తెలంగాణ హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి భారీ ఊరట దక్కింది. గచ్చిబౌలి పీఎస్‌లో తనపై నమోదైన కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆరోపణలతో పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో 2016 లో సీఎం రేవంత్ రెడ్డి, సోదరుడు కొండల్ రెడ్డి, లక్షయ్యలపై గచ్చిబౌలి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కేసును కొట్టివేయాలని 2020లో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత నెల 20 వ తేదీన ఇరువైపుల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు వెలువరించింది. ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని విచారణ చేపట్టిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని (Gachibowli PS) గచ్చిబౌలి పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది.






