- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టులో CM రేవంత్‌కు ఊరట
హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప ఊరట లభించింది. 2023లో భూపాలపల్లి పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి స్వల్ప ఊరట లభించింది. 2023లో భూపాలపల్లి పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkata Ramana Reddy)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తనపై రేవంత్ రెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు చేశారని మొగులపల్లి పోలీస్ స్టేషన్‌లో గండ్ర వెంకటరమణారెడ్డి రెండు ఫిర్యాదులు చేశారు. అయితే.. ఈ రెండు కేసులను కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా భూపాలపల్లి కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణకు స్వీకరించిన కోర్టు.. భూపాలపల్లి కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. అంతకుముందు కౌంటర్ దాఖలుకు గండ్ర వెంకటరమణారెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు.






