- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Reliance: మహా కుంభమేళాలో ‘రిలయన్స్’ సేవలు
మహా కుంభమేళాలో భక్తులకు ‘రిలయన్స్’ సేవలు అందిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా-2025 ఘనంగా కొనసాగుతున్నది. వేడుకల్లో ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ (Reliance) ఇండస్ట్రీస్ దాని అనుబంధ సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ద్వారా భక్తులకు సేవలను అందిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో రిలయన్స్ ‘క్యాంపా ఆశ్రమం’ను (campa) ఏర్పాటు చేసింది. అలసిపోయిన భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతోంది. భక్తులు రిఫ్రెష్‌మెంట్ అందించేలా ఆశ్రమాలను ఏర్పాటు చేసినట్లు రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కేతన్ మోడీ ఓ ప్రకటనలో వెల్లడించారు. జాతీయ సామరస్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజన్‌ను ప్రతిబింబించే ఈ పవిత్ర కార్యక్రమానికి ఆర్‌సీపీఎల్ సహకరించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కుంభమేళాలో యాత్రికులు సులభంగా చదవి అర్థం చేసుకోగలిగేలా సంకేతాలతో కార్యక్రమానికి సంబంధించిన డైరెక్షన్ బోర్డులు, భక్తుల కోసం బోట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.






