Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం .. నేడు జైలు నుంచి తిరుపతన్న విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-28 03:30:46  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో ఇవాళ మరో కీలక మలుపు చోటుచేసుకోబోతోంది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం .. నేడు జైలు నుంచి తిరుపతన్న విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో ఇవాళ మరో కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్న (Tirupathanna)కు సోమవారం దేశ అత్యున్నత న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు (Supreme Court) షరతులతో కూడిన బెయిల్ (Bail) మంజూరు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలోనే ఇవాళ తిరుపతన్న (Tirupathanna) దాదాపు 10 నెలల తరువాత జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గత 10 నెలలుగా పిటిషనర్ జైలులోనే ఉన్నారని వ్యాఖ్యానించింది. కేసులో ఇప్పటికే చార్జీషీటు కూడా దాఖలైందని.. పిటిషనర్ తిరుపతన్న ఇంకా జైలులో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని కోర్టు తెలిపింది.

తీర్పు సందర్భంగా ట్రయల్‌కు తిరుపతన్న (Tirupathanna) పూర్తిగా సహకరించాలని, ఎక్కడా ఎలాంటి జాప్యం చేయొద్దని సూచించింది. సాక్షులను ప్రభావితం చేసినా.. కేసులో ఆధారాలను లేకుండా చేసేందుకు ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం (State Government) బెయిల్ (Bail) రద్దు చేసేందుకు ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. పాస్‌పోర్ట్ (Passport) రద్దు సహా ఇతర బెయిల్ కండీషన్లను ట్రయల్ కోర్టు (Trail Court) ఇస్తుందని ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది.

కాగా, విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తరఫున సిద్ధార్థ్ లూథ్రా (Siddharth Luthra) తన వాదనలను కోర్టుకు బలంగా వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో తిరుపతన్న (Tirupathanna) ప్రధాన నిందితుడని కోర్టుకు విన్నవించారు. కేసులో ఆయన పాత్రపై ఇన్వెస్టిగేషన్‌కు మరో 4 నెలల సమయం పడుతోందని అన్నారు. అప్పటి వరకు తిరుపతన్నకు బెయిల్ ఇవ్వకూడదని ధర్మాసనాన్ని కోరారు. రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు హైకోర్టు (High Court) జడ్జిల ఫోన్లు కూడా తిరుపతన్న ట్యాప్ చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయారని కోర్టుకు సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు.

Next Story