- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు 'సింగరేణి' ఎన్నికల నోటిఫికేషన్
దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణిలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించనున్నట్ల డిప్యూటీ సీఎల్సీ ప్రకటించారు. అక్టోబర్ 6,7 తేదీల్లో నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత నామినేషన్ల స్క్రూటిని, ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 28న పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ జరపనున్నారు. కాగా 2019లోనే గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ఏదో కారణంతో వాయిదా వేస్తోంది. ఈ మేరకు అక్టోబర్ లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు నిన్న తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో బుధవారం డిప్యూటీ సీఎల్‌సీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముంగిట్లో జరుగుతున్న సింగరేణి ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండంగా మారుతాయనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.