ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: హాల్ టికెట్లు విడుదల

by Disha Web Desk 2 |
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: హాల్ టికెట్లు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ ఇంట‌ర్ బోర్డు వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్ టికెట్లు అప్‌లోడ్ చేసిన‌ట్లు బోర్డు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. హాల్ టికెట్లలో త‌ప్పులుంటే విద్యార్థులు స‌రి చేసుకోవాల‌ని అధికారులు సూచించారు. హాల్ టికెట్‌లో ఫోటో, సంతకం, పేరు, సబ్జెక్ట్ తదితర విషయాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్, లేదా బోర్డుకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

హాల్ టికెట్‌పై ప్రిన్సిప‌ల్ సంత‌కం లేకున్నా ప‌రీక్షకు అనుమ‌తి ఉంటుంద‌ని స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ టైమింగ్స్‌గా పేర్కొన్నారు. హాల్ టికెట్ల కోసం www.tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు. ఇంట‌ర్ ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరం ప‌రీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.



Next Story

Most Viewed