ఇకపై కాస్ట్ లీ..! 20 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంపు.. కొత్త రేట్లు ఇవే

by Ramesh Naini |

కాలం చెల్లిన వాహనాలను వదిలించుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.

ఇకపై కాస్ట్ లీ..! 20 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంపు.. కొత్త రేట్లు ఇవే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాలం చెల్లిన వాహనాలను వదిలించుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. దీంతో 20 ఏళ్లు దాటిన వాహనాల పునరుద్ధరణ కోసం రిజిస్ట్రేషన్ (Registration fees) చేసుకునే ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ (Central Surface Transport Department) నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టం (Motor Vehicles Act) కింద నూతన నియమాలను జారీ చేసింది. 20 సంవత్సరాలు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు భారీగా కొత్త ఫీజులు విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రజల అభ్యంతరాలు, సూచనలు పరిశీలించిన తర్వాతే కేంద్రం ఈ సవరణలు తీసుకొచ్చింది. ఇందులో దివ్యాంగుల వాహన రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 100 ఉంటే ప్రస్తుతం కూడా అదే ఉండగా... త్రీవీలర్లు, క్వాడ్రిసైకిళ్లకు గతంలో రూ. 3500 ఉండగా ఇప్పుడు రూ. 5వేలకు పెంచారు. మిగతావన్నీ రెట్టింపు చేశారు. దిగుమతి చేసుకున్న వాహనాలకు గరిష్ఠంగా రూ. 80వేలుగా నిర్ణయించారు.

20 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు..

  • దివ్యాంగుల వాహనాలకు రూ.100
  • మోటార్ సైకిళ్లకు రూ.2,000
  • త్రీ వీలర్లు, క్వాడ్రిసైకిళ్లకు రూ.5,000
  • లైట్ మోటార్ వాహనాలకు రూ.10,000
  • దిగుమతి చేసిన రెండు, మూడు చక్రాల వాహనాలకు రూ.20,000
  • దిగుమతి చేసిన నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాలకు రూ.80,000
  • మిగతా వాహనాలకు రూ.12,000
Next Story