హైకోర్టు రికార్డుల్లో దొరకని 17 రిట్ పిటిషన్లు.. వివరాలు సమర్పించాలని రిజిస్టార్ నోటీసులు

by Ramesh Naini |

1999 సంవత్సరం వరకు దాఖలైన (High Court) హైకోర్టు రికార్డుల్లో 17 రిట్ పిటిషన్‌లకు సంబంధించిన కేసు ఫైళ్లు కనుగొనలేకపోవడంతో, వాటికి సంబంధించిన వివరాలను సమర్పించాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌)-1 నోటీసులు జారీ చేశారు.

హైకోర్టు రికార్డుల్లో దొరకని 17 రిట్ పిటిషన్లు.. వివరాలు సమర్పించాలని రిజిస్టార్ నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: 1999 సంవత్సరం వరకు దాఖలైన (High Court) హైకోర్టు రికార్డుల్లో 17 రిట్ పిటిషన్‌లకు సంబంధించిన కేసు ఫైళ్లు కనుగొనలేకపోవడంతో, వాటికి సంబంధించిన వివరాలను సమర్పించాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌)-1 నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్‌లకు సంబంధించిన సమాచారం సంబంధిత అడ్వకేట్లు, పిటిషనర్లు వద్ద ఏమైనా ఉంటే, వాటిని నవంబర్‌ 7లోపు రిజిస్ట్రీలో సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అందజేసే వివరాల ఆధారంగా ఆ రిట్ పిటిషన్‌లను పునర్విచారణకు తీసుకునే అవకాశం ఉంటుందని రిజిస్ట్రీ తెలిపింది. అయితే గడువు తేది లోపు వివరాలు అందజేయని పక్షంలో, ఆయా కేసులను పెండింగ్‌ కేసుల జాబితా నుంచి తొలగించనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.

Next Story