- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి.. డీజీపీ జితేందర్
వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్లలో బాధితులు అందజేస్తున్న ఫిర్యాదులను నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్లలో బాధితులు అందజేస్తున్న ఫిర్యాదులను నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ యూనిట్ల నుంచి వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో శనివారం డిజిపి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.... శాంతి భద్రతల సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు పోలీస్ స్టేషన్ కి వస్తారని, వారి ఇస్తున్న ఫిర్యాదులను నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. దీనివల్ల కేసుల సంఖ్య పెరుగుతుందేమో? అనే సందేహాలు పెట్టుకోవద్దని కేసులు పెరిగినప్పటికీ పోలీసు అధికారులు స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఎవరూ ప్రశ్నించరని తెలిపారు. కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో వాస్తవాలను తెలుసుకొవాలని సూచించారు. బాధితులకు సరైన న్యాయం జరిగనప్పుడే ప్రజల్లో అభిమానాన్ని, విధి నిర్వహణలో సంతృప్తిని పొందవచ్చన్నారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ఇటీవల పోలీస్ స్టేషన్ల పనితీరును సమీక్షించినప్పుడు దాదాపు పది పోలీస్ స్టేషన్లో 100 శాతం ఫిర్యాదుదారులు సంతృప్తి వ్యక్తం చేశారని సంతోషం వ్యక్తం చేశారు.
మహిళా పోలీస్ సిబ్బంది సేవలను సమర్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం భగవత్ మాట్లాడుతూ.... స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును సమీక్షించేందుకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉపయోగపడుతుందని, ఫిర్యాదుదారులకు క్యూఆర్ కోడ్ పట్ల అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. రానున్న బక్రీద్ పండగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా అరికట్టాలని, ఇతర రాష్ట్రాల నుండి గాని ఇతర జిల్లాల నుండి గాని వచ్చేవాటిపై నిఘా పెట్టాలని సూచించారు. గోవుల రక్షణ పేరిట ఇతరులు సమాచారం ఇస్తే తీసుకోవాలని , పరిస్థితులు వారి చేతిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. అరికట్టేందుకు కొత్త క్రిమినల్ చట్టాల్లో ఉన్న సెక్షన్లను నమోదు చేయడం ద్వారా యూనిట్ ఆఫీసర్ల నుంచి ప్రతిపాదనలను పంపి అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలను కేంద్రాలను మూసివేయాలన్నారు. తద్వారా రైతులను ఆదుకోవాలని అన్నారు. ఏఐజి రమణ కుమార్, డీఎస్పీ సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.






