- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాలిబండ అగ్ని ప్రమాదానికి ముందు పేలిన రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెషర్లు
హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి శాలిబండ ప్రాంతంలో ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి శాలిబండ ప్రాంతంలో ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మంటలు వ్యాప్తి చెందక ముందు భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పోలీసులు ఈ కోణంలో విచారణ చేపట్టగా అగ్ని ప్రమాదానికి అసలు కారణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక దర్యాప్తులో అగ్ని ప్రమాదం మొదట గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లోనే ప్రారంభమైనట్లు నిర్ధారించారు. షోరూమ్‌లోని రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెషర్లలో మంటలు అంటుకోవడం వలన భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల తీవ్రతకు షోరూమ్ ముందు పార్క్ చేసి ఉన్న TG 07 V848 నంబర్ గల CNG కారు పల్టీ కొట్టింది.
ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి కారు అద్దాలు పగులగొట్టి బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, షోరూమ్ నుంచి మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద తీవ్రత కారణంగా షోరూమ్ యజమాని భారీగా నష్టపోయారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో జరిగిన ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలను, నష్టాన్ని అంచనా వేసేందుకు పోలీసులు ప్రస్తుతం సైంటిఫిక్ ఎవిడెన్స్ (శాస్త్రీయ ఆధారాలు) సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు.






