- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజయ్ దేవగన్ సీన్ రిపీట్.. మన హైదరాబాద్ యువకుల డేంజరస్ స్టంట్.. రీల్స్ పిచ్చిలో భాగమే!
సోషల్ మీడియాలో లైక్స్, ఫాలోవర్స్ కోసం కొంత మంది యువత విచిత్రమైన రీల్స్ చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో లైక్స్, ఫాలోవర్స్ కోసం కొంత మంది యువత విచిత్రమైన రీల్స్ చేస్తున్నారు. రీల్స్ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే స్టంట్స్ వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్- అత్తాపూర్ సమీపంలోని రోడ్డుపై ముగ్గురు యువకులు చేసిన ప్రమాదకర విన్యాసాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వైరల్ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. రెండు స్కూటీపై ఒక్కో కాలు పెట్టుకుని, మధ్యలో నిలబడి ప్రయాణించే ప్రయత్నం చేసిన యువకుడు పెద్ద ప్రమాదానికే ఆహ్వానం పలికాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఒక సినిమాలో చేసిన ‘టూ బైక్ స్టంట్’ ను రిపీట్ చేస్తూ రోడ్డుపై నిర్లక్ష్యంగా ప్రదర్శించారు. వీడియో చిత్రీకరణ సమయంలో రోడ్డు మీద ఇతర వాహనాలు కూడా ప్రయాణిస్తుండటం గమనార్హం.
సోషల్ మీడియాలో వీడియో బాగా వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను విస్మరించి, పబ్లిక్ రోడ్‌ను స్టంట్ లొకేషన్‌గా మార్చారని నెటిజన్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు అవసరం అని నెటిజన్‌లు అభిప్రాయపడ్డారు. నువ్వు ఏమైనా అజయ్ దేవగన్ అనుకున్నావా? అని నెటిజన్‌లు ఈ స్టంట్‌పై సెటైర్లు వేశారు. కాగా, నటుడు అజయ్ దేవగన్ తొలి చిత్రం 'ఫూల్ ఔర్ కాంటే' (1991) లో చేసిన రెండు బైక్‌లపై నిలబడి చేసిన స్టంట్ చాలా ప్రసిద్ధి చెందింది. అతను రెండు కదులుతున్న బైక్‌లపై నిలబడి ఉన్న ఈ సీన్ అతని కెరీర్‌లోనే ఐకానిక్ స్టంట్‌గా మిగిలిపోయింది. వీడియో ఇదే..






