తెలంగాణకు మరోసారి రెడ్ అలర్ట్స్.. అత్యంత భారీ వర్షాలు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణకు మరోసారి రెడ్ అలర్ట్స్.. అత్యంత భారీ వర్షాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో గాలివేగం గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరం భీం జిల్లాలలో అత్యధిక వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఆదిలాబాద్ జిల్లా తాంసి లో 17 సెం.మీ వర్షాపాతం:

ఆదివారం ఆదిలాబాద్ లో 17 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 16 సెం.మీ, నిర్మల్ జిల్లా సారంగపూర్ లో 13 సెం.మీ, మంచిర్యాల జిల్లా భీమినిలో 12 సెం.మీ, కుమరంభీం జిల్లా జైనూరులో 10 సెం.మీ, కుమరం భీం జిల్లా కెరమెనిలో 10 సెం.మీ, మంచిర్యాల 10 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 9 సెం.మీ, భోథ్ లో 9 సెం.మీ, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 9 సెం.మీ, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో 8 సెం.మీ, కుమరం భీం జిల్లా దహెగాంలో 7 సెం.మీ, మంచిర్యాల జిల్లా జైపూర్ లో 7 సెం.మీ, తాండూర్ లో 7 సెం.మీ, ముధోల్ లో 7 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో 6 సెం.మీ, కుమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో 6 సెం.మీ, సిర్పూర్ లో 5 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.

Next Story