- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భానుడి ప్రతాపానికి అట్టుడుకుతున్న రాష్ట్రం.. రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 8 గంటలు దాటితే గడప బయట అడుగు పెట్టాలంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 8 గంటలు దాటితే గడప బయట అడుగు పెట్టాలంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక 10 గంటలు దాటితే.. వంటిల్లు కూడా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకరస్థాయికి చేరుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టెంపరేచర్ సాధారణం కంటే 2-3 డిగ్రీలు పెరిగే ఛాన్సుందని హెచ్చరించింది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని ప్రకటించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. బుధవారం జిల్లాలో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ఛాన్సుండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని, పిల్లలు, వృద్ధులు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీల మధ్య ఉండొచ్చని, ఉదయం వేళల్లో పొడి వాతావరణం, మధ్యాహ్న సమయంలో తీవ్రమైన ఉక్కపోత ఉంటుందని తెలిపింది.






