- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఎక్సైజ్‌కు రికార్డు ఆదాయం.. హిస్టరీలో ఫస్ట్ టైమ్ రూ.40,209 కోట్లకు చేరిక
తెలంగాణ ఎక్సైజ్ ఆదాయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.40,209 కోట్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతూ వస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ఏకంగా రూ. 40,209 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.20,859 కోట్లుగా ఉండగా, కేవలం ఏడు సంవత్సరాల్లోనే ఇది రెట్టింపు స్థాయికి చేరుకోవడం విశేషం.గత ఆర్థిక సంవత్సరం రూ.37,487 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడు రూ.40,209 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ. 2,722 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఇది సుమారు 7 శాతం వృద్ధిని సూచిస్తోంది.
లిక్కర్ వర్సెస్ బీరు అమ్మకాలు..
2025-26 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ అమ్మకాలు స్వల్పంగా పెరగ్గా, బీరు అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. లిక్కర 382.91 లక్షల కేసుల అమ్మకాలు జరిగ్గా.. బీరు 387.34 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయి. కాగా, ఏడాదిలో 536.13 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరగడం గమనార్హం. ఈ మొత్తం ఏడాదిలో డిసెంబర్ నెలలో అత్యధికంగా రూ.5,051 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదేవిధంగా రాష్ట్రంలోని 2,620 లిక్కర్ షాపుల ద్వారా సంవత్సరానికి రెంటల్ ఫీజు రూపంలో రూ.1,771 కోట్ల ఆదాయం వస్తోంది. అలాగే 1,214 బార్ల ద్వారా రూ. 549 కోట్లు సమకూరుతున్నాయి. ఈ ఏడాది కొత్త షాపుల కోసం వచ్చిన 95,628 దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి అదనంగా రూ.2,869 కోట్లు ఆదాయం లభించింది.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఎక్సైజ్ ఆదాయ ప్రస్థానం ఇలా..
2015-16: రూ. 12,706 కోట్లు
2017-18: రూ. 17,597 కోట్లు
2021-22: రూ. 30,783 కోట్లు
2023-24: రూ. 37,675 కోట్లు
2025-26: రూ. 40,209 కోట్లు






