- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముందే చెప్పారు కదా! హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో డ్రంకన్ డ్రైవ్ కేసులు
హైదరాబాద్ నగరంలో డ్రంకన్ డ్రైవ్ ఘటనలు రికార్డు స్థాయికి చేరాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పోలీసులకు చిక్కారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో డ్రంకన్ డ్రైవ్ ఘటనలు రికార్డు స్థాయికి చేరాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పోలీసులకు చిక్కారు. తాజా సమాచారం ప్రకారం.. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే మొత్తం 1,198 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కావడం గమనార్హం. నిన్న రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామున వరకు నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా లెక్కచేయకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.
మందుబాబుల హంగామా..
పలు ప్రాంతాల్లో మందుబాబుల హంగామా పోలీసులకు తలనొప్పిగా మారింది. నాంపల్లి, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో మద్యం మత్తులో ఉన్న వారు హల్‌చల్ సృష్టించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయినప్పటికీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి డ్రంకన్ డ్రైవ్‌కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించి రోడ్డు భద్రతకు సహకరించాలని సూచించారు. న్యూ ఇయర్ వేళ గత కొన్ని రోజులుగా డ్రంకన్ డ్రైవ్ హెచ్చరికలు జారీ చేసిన మందుబాబులు తీరు మాత్రం మారలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
అర్ధరాత్రి సజ్జనార్ కేక్ కటింగ్..
ఇదిలా ఉండగా.. నూతన సంవత్సరం సందర్బంగా బుధవారం అర్ధరాత్రి తెలంగాణ సచివాలయం, చార్మినార్, కేబీఆర్ పార్కు, మెహిదీపట్నంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కేక్ కట్ చేసి 2026కు స్వాగతం పలికారు. నగర ప్రజలకు, పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భద్రతే తమకు ప్రాధాన్యమని, నేర రహిత నగరమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ట్వీట్ ఇదే..






