- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి కార్తీకమాసం(Kartika Masam 2025) కలిసొచ్చింది. కార్తీకమాసంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 33 రోజులకు రూ.7 కోట్ల 27 లక్షల 26 వేల 400 నగదు లభించగా, 117 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు కానుకలుగా సమర్పించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కోటి 30 లక్షలు అధికంగా మల్లన్న హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కార్తీకమాసంలో హుండీ ఆదాయం ఈ స్థాయిలో రావడం మొదటిసారి కావడం విశేషం. కార్తీకమాసం హిందూ సంప్రదాయాలలో అత్యంత పుణ్యమాసంగా భావించబడుతుంది. ఈ పవిత్ర నెలలో భక్తులు శివబ్బావాని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. శివారాధన వల్ల పాపక్షయము, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం మాత్రమే కాకుండా స్వర్గలోక ప్రాప్తి కూడా లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి.
Next Story






