Energy: తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం.. ఎన్ని మెగావాట్లో తెలుసా?

by Ramesh Naini |   (  Updated:2025-02-10 08:11:48  IST  )

తెలంగాణలో రికార్డు స్థాయిలో భారీగా విద్యుత్ వినియోగం నమోదైంది. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగనున్నది.

Energy: తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం.. ఎన్ని మెగావాట్లో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ(Telangana) లో రికార్డు స్థాయిలో భారీగా విద్యుత్ వినియోగం (electricity consumption) నమోదైంది. తాజాగా 16 వేల మెగావాట్లకు చేరువలో (Energy) విద్యుత్ డిమాండ్ నమోదు అయినట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. వేసవి, యాసంగి పంటల ప్రభావంతో రాష్ట్రంలో భారీగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నదని తెలిపారు. గత ఏడాది మార్చిలో అత్యధిక డిమాండ్లు నమోదైతే.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధిక డిమాండ్లు తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది మార్చిలో రికార్డు స్థాయిలో 15623 మెగావాట్లు నమోదైందని, ఈ నెల 7వ తేదీన అత్యధికంగా 15920 మెగా వాట్లకు పెరిగిందన్నారు.

రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగనున్న నేపథ్యంలో రేపు విద్యుత్ సంస్థల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను పంపిణీ సంస్థలు అందిస్తున్నాయని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. డిమాండ్ ఎంతగా పెరిగిన దానికి తగ్గట్టుగా సరఫరా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Next Story