CM Revanth Reddy : తొలి ఏడాది ప్రజాప్రభుత్వం రికార్డు పాలన : సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-08 06:25:29  IST  )

ప్రజా ప్రభుత్వం(People's Government) తొలి ఏడాది(First year) రికార్డు పాలన(Record-breaking rule) సాగించిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు.

CM Revanth Reddy : తొలి ఏడాది ప్రజాప్రభుత్వం రికార్డు పాలన : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రజా ప్రభుత్వం(People's Government) తొలి ఏడాది(First year) రికార్డు పాలన(Record-breaking rule) సాగించిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం తొలి ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రభుత్వ విజయాలను వివరిస్తూ ట్వీట్ చేశారు. రైతు రుణమాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో ప్రజా ప్రభుత్వం రికార్డు సృష్టించిందని తెలిపారు. మహిళా సంక్షేమ పథకాలైన ఉచిత బస్సు, 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500గ్యాస్ సిలిండర్, కులగణన, పర్యావరణ కేంద్రీకృతమైన పట్టణాభివృద్ధి విధానాల అమలును ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుంటున్నాయని వెల్లడించారు.

రైతు సంక్షేమానికి 25లక్షల మంది రైతులకు 2లక్షల వరకు 21వేల కోట్ల రుణమాఫీ చేశామని, సన్న ధాన్యానికి రూ.500బోనస్, ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని గుర్తు చేశారు. 4లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోబోతున్నామని, ఏడాదిలోనే 55వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు, స్కిల్ , స్పోర్ట్స్ యూనివర్సిటీల నిర్మాణం, డ్రగ్ నిర్మూలన, చర్యలు చేపట్టామని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి, హైదరాబాద్ ప్రగతి, మెట్రో రెండో దశ విస్తరణ, ఆర్ఆర్ఆర్ సహా కీలక రోడ్లు, ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెలుతుందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలను పునరుద్దరణ చేశామని.. ప్రజాపాలనలో డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. నాపై తెలంగాణ ప్రజలకు ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.

Next Story