CM రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ.. ఊపిరిపీల్చుకున్న విద్యార్థులు

by Gantepaka Srikanth |

జగిత్యాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలకు ఎట్టకేలకు గుర్తింపు లభించింది.

CM రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ.. ఊపిరిపీల్చుకున్న విద్యార్థులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జగిత్యాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలకు ఎట్టకేలకు గుర్తింపు లభించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) ఈ కళాశాలకు గుర్తింపు ఇచ్చింది. దీంతో ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ కళాశాలను త్వరలోనే మానకొండురు నియోజకవర్గంలోని బెజ్జంకికి తరలించనున్నారు. సుమారు 75 ఎకరాల్లో ఈ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో అధికారులతో కూడిన బృందం అక్కడ పర్యటించనుంది.

గత పాలకుల తప్పిదంతో..

బీఆర్ఎస్ హయాంలో 2023–24 విద్యా సంవత్సరంలో సిద్దిపేట డిగ్రీ కాలేజీలో నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ కింద మరో కాలేజీ మంజూరు కావడంతో.. దాన్ని జగిత్యాలలోని సాంఘిక సంక్షేమ మహిళా కాలేజీకి మార్చారు. అప్పటి మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనలతో ఈ కాలేజీని కోరుట్లలోని గవర్నమెంట్ బిల్డింగ్ లో కొనసాగిస్తున్నారు. అయితే ఈ కాలేజీ విషయంలో గత ప్రభుత్వం ఆనాలోచితంగా వ్యవహరించింది. అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి వర్సిటీ గుర్తింపును విస్మరించింది. దీంతో ఈ కోర్సులో చేరిన విద్యార్ధులు సందిగ్ధంలో పడిపోయారు. మొదటి సంవత్సరం పూర్తయిన విద్యార్థులు ఏ వర్సిటీ అటానామస్ కింద ఎగ్జామ్స్ రాయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక్కడ చదివే బయటికి వెళ్తే.. ఏ వర్సిటీ గుర్తింపు లేకపోతే తమ మనుగుడ కష్టమేనని విద్యార్థులు భావించారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ

సాంఘిక సంక్షేమ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలపై ప్రస్తుత గురుకులాల కార్యదర్శి అలగు వర్షిణి ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షల సమయంలో హైయ్యర్ఎడ్యుకేషన్ నుంచి ఫోన్ చేయించి ఎగ్జామ్ పేపర్ పంపించాలని కోరారు. అగ్రికల్చర్ ప్యాట్రన్ ఎలా ఉంటుందో.. దానికి అనుగుణంగా ఎగ్జామినర్ను పెట్టి నిర్వహించుకుంటామని తెలిపారు. ఓయూ అటానామస్ ఎలా ఉంటుందో అదేవిధంగా ఫస్టి ఇయర్ కొనసాగించారు. చివరకు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టి తీసుకెళ్లారు. చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కమిటీ వేయాలని, అగ్రికల్చర్ కాలేజీ గుర్తింపునకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రెండు బీసీ వెల్ఫేర్, ఒక సోషల్ వెల్ఫేర్ కాలేజీలపై గురుకులాల సెక్రెటరీ, బీసీ సెక్రెటరీ, యూనివర్సిటీ డీన్ తో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రికమండేషన్స్ ప్రకారం సాంఘిక సంక్షేమ సొసైటీ కింద ఉన్న గురుకుల అగ్రికల్చర్ కాలేజీకి గుర్తింపుఇచ్చారు. దాన్ని మానకొండురు నియోజకర్గం బెజ్జంకి మండలానికి తరలించనున్నారు. 75 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధింకి రెండు రోజుల్లోనే అక్కడ ప్రత్యేక బృందం పర్యటించనున్నది.

Next Story