- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పోలీస్ కు 18 పతకాలు : డీజీపీ అభినందనలు
కేరళలోని కొచ్చిలోని కడవంత్రలో జరిగిన పోలీస్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ లో సత్తా చాటిన తెలంగాణ పోలీస్ క్రీడా కారులకు డీజీపీ డా. జితేందర్ అభినందనలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేరళలోని కొచ్చిలోని కడవంత్రలో జరిగిన పోలీస్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ లో సత్తా చాటిన తెలంగాణ పోలీస్ క్రీడా కారులకు డీజీపీ డా. జితేందర్ అభినందనలు తెలిపారు. ఎప్రిల్ 11 నుంచి 15వ తేది వరకు జరిగిన పోటీలలో తెలంగాణ పోలీసు క్రీడాకారులు 18 పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాయలంలో మంగళవారం డీజీపీని కలిసి పతకాలను ప్రదర్శించారు. 12 మంది క్రీడాకారులను పాల్గొనగా 18 పతకాలను గెలుచుకున్నట్లు డీజీపీ తెలిపారు. రెండు బంగారు పతకాలు, రెండు రజిత,14 కాంస్య పతకాలు గెలుచున్నట్లు తెలిపారు.
తెలంగాణ పోలీస్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు డిఎస్పీ పి.సీతా రెడ్డి సిఐడి హైదరాబాద్, హెచ్‌సి వి.నరసింహ రావు పిఎస్ సైదాబాద్ ఎన్ జీవో మిక్స్‌డ్ డబుల్స్‌లో 50+ కేటగిరిలో 2 బంగారు పతకాలు గెలుచుకున్నాట్లు తెలిపారు.ఎసిపి ఆర్.కళింగ రావు, ఇఓడబ్ల్యూ, సైబరాబాద్ , డిఎస్పీ పి.సీతా రెడ్డి సిఐడి హైదరాబాద్, గెజిటెడ్ ఆఫీసర్స్ (జిఓలు) మిక్స్‌డ్ డబుల్స్ 50+కేతటగిరీలో 2 రజత పతకాలు గెలుచుకున్నట్లు తెలిపారు. డిఎస్పీ పి.సీతా రెడ్డి బంగారు,రజిత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐజీపి స్పోర్ట్స్ రమేష్, డిఎస్పీ స్పోర్ట్స్ రామారావుతో పాటు క్రీడా అధికారులు, కోచ్‌లు పాల్గొన్నారు.
- Tags
- telangana police






