గుంటల్లో రిజిస్ట్రేషన్.. ప్లాట్లలో అమ్మకాలు.. రోడ్డు లేకుండానే వెంచర్

by Gantepaka Srikanth |

ప్రభుత్వ అనుమతులు తీసుకొని వెంచర్ చేస్తే తమకు గిట్టుబాటు కాదని అనుకున్నారేమో తెలియదు గానీ.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు మాడ్గుల మండలంలో నయా దందాకు తెర లేపారు.

గుంటల్లో రిజిస్ట్రేషన్.. ప్లాట్లలో అమ్మకాలు.. రోడ్డు లేకుండానే వెంచర్
X

దిశ, మాడ్గుల: ప్రభుత్వ అనుమతులు తీసుకొని వెంచర్ చేస్తే తమకు గిట్టుబాటు కాదని అనుకున్నారేమో తెలియదు గానీ.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు మాడ్గుల మండలంలో నయా దందాకు తెర లేపారు. మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని గుడి తండా సమీపంలో సర్వేనెంబర్ 117‌లో నాలుగు ఎకరాల పామ్ లాండ్‌ను కొనుగోలు చేసి హద్దురాళ్ళు పాతారు. వాటిని గుంటల లెక్కన విక్రయిస్తున్న పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.

నింబధనలను తుంగలో తొక్కి..

నిబంధనల ప్రకారం నాలా కన్వర్షన్ చేసి హెచ్ఎండీఏ లేఔట్ అనుమతులు వచ్చిన తర్వాత వెంచర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే సదరు వెంచర్ నిర్వాహకుడు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా గుంటల లెక్కన విక్రయిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో ఫోర్త్ సిటీకి దగ్గర, త్రిబుల్ ఆర్ కు లోపల అంటూ కేవలం ఒక గుంట రూ. 1 లక్ష 25 వేలకే అంటూ విస్తృత ప్రచారం చేస్తూ అమ్మకాలు జరుపుతున్నాడు. అయితే దీనిని పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతోనే రియాల్టర్ లు వారి దందాను మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే ఆ వెంచర్ కు రోడ్డు లేకపోవడం కొసమెరుపు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు పాటించని వెంచర్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




Next Story