సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-05 06:00:16  IST  )

పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ (Prasad Kumar)ను ఎమ్మెల్యే దానం నాగేందర్‌ (Danam Nagender) కోరారు.

సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)ను ఇటీవలే ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన తన రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశిస్తే.. ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడం.. పోరాడటం తనకేమీ కొత్త కాదని కామెంట్ చేశారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో పదేళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని దానం నాగేందర్ అన్నారు.

Next Story