- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోషామహల్, జూబ్లీహిల్స్‌లో పోటీకి సిద్ధం.. మాధవీ లత సంచలన స్టేట్‌మెంట్
బీజేపీ (BJP) సపోర్ట్ లేకుండానే మూడు సార్లు రాజాసింగ్ (Raja Singh) ఎమ్మెల్యేగా గెలిచాడా అని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ (BJP) సపోర్ట్ లేకుండానే మూడు సార్లు రాజాసింగ్ (Raja Singh) ఎమ్మెల్యేగా గెలిచాడా అని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్‌ను ఎమ్మెల్యేగా చేస్తే.. పార్టీని పట్టుకుని ఏది పడితే అది ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. మహిళలను, ఇతర మతాల వారిని దూషిండచమే హిందుత్వమా అని ఫైర్ అయ్యారు.
పార్టీలో తనకు ఎవరూ సహకరించలేదని.. హైదరాబాద్ ఎంపీ ఎన్నికల్లో రాజాసింగ్ తనకు సహకరించకపోవడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఎంపీ అభ్యర్థిగా మగాళ్లే దొరకలేదా అంటూ తనను రాజాసింగ్ హేళన చేశారని గుర్తు చేశారు. కానీ, గోషామహల్‌లో రాజాసింగ్ కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. మాధవీ లత అంత వీక్ కాదని.. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని పేర్కొన్నారు. గోషామహల్ స్థానంలో తనను రీప్లేస్ చేయాలని రాష్ట్ర అధినాయకత్వం భావిస్తుండటం తన అదృష్టమని తెలిపారు. జూబ్లీహిల్స్, గోషామహల్ ఇలా పార్టీ ఎక్కడ పోటీ చేయమన్నా.. తాను అక్కడ గిరి గీసి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమని మాధవీ లత స్పష్టం చేశారు.






