ఎమ్మెల్సీ పోరుకు ‘సై’..! అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు, యూనియన్లు

by Kema Shiva Kumar |

శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.

ఎమ్మెల్సీ పోరుకు ‘సై’..! అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు, యూనియన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా గోదావరి అంజిరెడ్డిని పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీఆర్ఎస్ మాత్రం పోటీ చేయరాదని నిర్ణయించింది. కాంగ్రెస్ ఒకటి రెండు రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి ప్రధానంగా నరేందర్ రెడ్డి, ప్రసన్న, హరికృష్ణ, రమణారెడ్డి పేర్లు తెరమీదకి వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి రవీందర్ సింగ్ కొంత కాలంగా అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నా రు.

అయితే, పార్టీయే ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్ గా బరిలో నిలచే అవకాశం ఉంది. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీజేపీ నుంచి మల్క కొముర య్య, పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్ రెడ్డి, యూ టీఎఫ్-టీపీటీఎఫ్ సంయుక్త అభ్యర్థిగా అశోక్ కుమా ర్ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యారు. అయితే వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా యాదగిరి, శేఖర్ రావు ప్రచారం చేస్తున్నారు. నల్గొండ టీచర్స్ అభ్యర్థులుగా పీఆర్టీయూ నుంచి శ్రీపాల్ రెడ్డి, యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి, బీజేపీ నుంచి పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సర్వోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, వరంగల్ కు చెందిన వెంకటస్వామి సుందర్ రాజు ఉవ్విళ్లురుతున్నారు.

Next Story