- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026 బ్యాంకు సెలవుల క్యాలెండర్ విడుదల.. గరిష్టంగా 16 రోజులు బ్యాంకులు బంద్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2026 సంవత్సరానికి సంబంధించి బ్యాంకు సెలవుల అధికారిక క్యాలెండర్‌ను విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2026 సంవత్సరానికి సంబంధించి బ్యాంకు సెలవుల అధికారిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. జాతీయ సెలవులు, ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి వివిధ రాష్ట్రాల్లో గరిష్టంగా 16 రోజుల వరకు బ్యాంకులు మూతపడనున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి వంటి జాతీయ సెలవులతో పాటు హోలీ, ఉగాది, రంజాన్, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల రోజుల్లోనూ బ్యాంకులకు సెలవులు ఉంటాయని తెలిపింది. అలాగే ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు సాధారణంగా బ్యాంకులకు సెలవులుగానే కొనసాగుతాయని పేర్కొంది.
ప్రాంతీయ పండుగల కారణంగా రాష్ట్రానికి రాష్ట్రానికి సెలవుల జాబితాలో తేడాలు ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి 2026 బ్యాంకు సెలవుల జాబితాను కూడా ప్రకటించింది. బ్యాంకుల భౌతిక బ్రాంచీలు మూసి ఉన్నప్పటికీ, ఏటీఎంలు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. వినియోగదారులు బ్యాంకింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.
2026లో ముఖ్యమైన బ్యాంకు సెలవులు (ఏపీ-తెలంగాణ):
జనవరి: 15వ తేదీ మకర సంక్రాంతి, 26వ తేదీ రిపబ్లిక్ డే
ఫిబ్రవరి: సెలవులు లేవు
మార్చి: 3వ తేదీ హోలీ, 19వ తేదీ ఉగాది , 21వ తేదీ రంజాన్ (ఏపీలో 20వ తేదీ), 27వ తేదీ శ్రీరామ నవమి
ఏప్రిల్: 1వ తేదీ అకౌంట్స్ క్లోజింగ్ డే, 3వ తేదీ, గుడ్ ఫ్రైడే, 14వ తేదీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి
మే : 1వ తేదీ మే డే, 27వ తేదీ బక్రీద్
జూన్: 26వ తేదీ మొహర్రం ( ఏపీలో 25)
జులై : సెలవులు లేవు
ఆగస్టు: 15 వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం , 26వ తేదీ మిలాద్ ఉన్-నబీ (ఏపీలో 25)
సెప్టెంబర్ : 4వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి, 14వ తేదీ వినాయక చవితి
అక్టోబర్ : 2వ తేదీ గాంధీ జయంతి, 20వ తేదీ విజయ దశమి
నవంబర్ : 24వ తేదీ గురునానక్ జయంతి ( ఏపీలో సెలవు లేదు), 8వ తేదీ దీపావళి (ఆదివారం)
డిసెంబర్ : 25వ తేదీ క్రిస్మస్






