ఫెమా ఉల్లంఘనలపై జనప్రియ టౌన్‌షిప్స్‌‌కు కాంపౌండింగ్ ఆర్డర్.. జరిమానా విధించిన ఆర్‌బీఐ

by Ramesh Naini |

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫెమా నింబంధనల కింద కేసులు నమోదు చేసిన జనప్రియ టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఊరట నిచ్చింది.

ఫెమా ఉల్లంఘనలపై జనప్రియ టౌన్‌షిప్స్‌‌కు కాంపౌండింగ్ ఆర్డర్.. జరిమానా విధించిన ఆర్‌బీఐ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫెమా నింబంధనల కింద కేసులు నమోదు చేసిన జనప్రియ టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఊరట నిచ్చింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై జనప్రియ టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పై ఈడీ చేపట్టిన దర్యాప్తును నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది.

మూడు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. రూ.64.66 కోట్ల విదేశీ పెట్టుబడులకు సంబంధించి నివేదిక ఆలస్యంగా సమర్పించారని ఈడీ పేర్కొంది. రూ.13.20 కోట్లకు సంబంధించిన ఎఫ్ సీ జీపీఆర్, వార్షిక విదేశీ ఆస్తులు, అప్పుల రిటర్న్' (ఎఫ్ఎల్ఏ) పత్రాలను సమర్పించలేదని తెలిపింది. జనప్రియ టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఆర్‌‌బీఐని ఆశ్రయించడంతో రూ.1.68లక్షలు జరిమానా విధించి కాంపౌండింగ్ ఆర్డర్ జారీ చేసింది.

Next Story