- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధిక వర్షాల నేపథ్యంలో ఆర్అండ్ బీ అధికారులు హై అలర్ట్ గా ఉండాలి
రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు హై అలెర్ట్ గా ఉండాలని..

- తెగిన రోడ్లు, కల్వర్టుల వద్ద తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి
- అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్ లోనే ఉంటూ, క్షేత్ర స్థాయి పరిస్థితులు పర్యవేక్షించాలి
- ఏ మాత్రం అలసత్వం వహించొద్దు, ఎవరూ సెలవు పై వెళ్లొద్దు
- - రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు హై అలెర్ట్ గా ఉండాలనీ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా రవాణాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టులు వద్ద తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. అధిక వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు వివరాలపై శనివారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,ఇతర ఆర్అండ్ బి ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వచ్చిన వరద ప్రవాహాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్అండ్ బీ పరిధిలో 454 చోట్ల సమస్య ఏర్పడిందని, అందులో 629 కి.మీ రోడ్డు దెబ్బతిందని, 22 చోట్ల రోడ్డు తెగిపోతే వెంటనే 4 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశామన్నారు. 171 చోట్ల లో ఇంకా కాజ్ వే లు, కల్వర్టులు వరద ప్రవాహం ఉందని, రాకపోకలకు ఇబ్బంది ఉన్న 108 ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన 71చోట్ల క్లియర్ చేశామని, మిగతా చోట్ల వేగంగా క్లియర్ చేస్తున్నామని అన్నారు. వాగుల వెంట 58 కి.మీ రోడ్డు కోతకు గురైందని, అందులో 378 మీటర్లు మూసివేశామన్నారు. మొత్తంగా 147 చోట్ల లో కాజ్ వే, మైనర్ బ్రిడ్జిలు, కల్వర్టులు తాత్కాలికంగా, శాశ్వతంగా పునరుద్ధరించాలని గుర్తించామని మంత్రి పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఇంకా రెండు మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆర్అండ్బి ఇంజనీర్లు కల్వర్టులు, లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్ వే ల వద్ద విధిగా తరచూ క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తూ ప్రాణనష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలనీ సూచించారు. అందుకు పోలీస్, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 24/7 ఆర్అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉన్నారని,ప్రత్యేకంగా జిల్లా సర్కిల్స్ వారిగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్ అండ్ బి కంట్రోల్ సెంటర్ కు అటాచ్ చేసి మానిటరింగ్ చేస్తున్నామని స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ మంత్రికి తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు, వరదలకు దెబ్బతిన్న రోడ్లు,కల్వర్టుల పూర్తి స్థాయి వివరాలు పంపాలని జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఫీల్డ్ మానిటరింగ్ చేయాలని స్టేట్ రోడ్స్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ను మంత్రి ప్రత్యేకంగా ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తం జిల్లాల వారీగా ఆర్ అండ్ బి 37 డివిజన్ల పరిస్థితులు, ఫీల్డ్ ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అలెర్ట్ గా ఉన్నామని సి.ఈ మోహన్ నాయక్ మంత్రికి వివరించారు. పాడైన రోడ్లు,వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలనీ మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్ లోనే ఉండాలనీ,క్షేత్ర స్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు తనకు చేరవేయాలన్నారు. స్టేట్ ఎన్ హెచ్ రోడ్ల కు సంబంధించిన వివరాలు ఇంచార్జి ఈఎన్సి జయ భారతి, ఆర్వోబి, ఆర్ యు బి ల వద్ద పరిస్థితిని సి.ఈ రాజేశ్వర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఏ మాత్రం అలసత్వం వహించొద్దనీ.. ఆస్తి నష్టం జరిగితే మళ్లీ పునరుద్ధరించుకుంటాం కానీ ప్రాణ నష్టం జరిగితే తిరిగి తేలేమని ప్రతి ఒక్క ఆర్ అండ్ బి ఇంజనీర్ బాధ్యతతో మెలగాలని, మరో రెండు రోజులు ఎవరూ సెలవు పై వెళ్లొద్దని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఆర్ అండ్ బి అధికారులు యుద్ద ప్రాతిపదికన చేపట్టిన చర్యలు, క్షేత్ర స్థాయిలో చూపిన పని తీరును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని వారికి చెప్పారు.






