- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయదుర్గం భూముల వేలం.. SBI వైఖరిపై ప్రభుత్వం సీరియస్
భాగ్యనగరంలోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి 5.09 ఎకరాలు వేలంపై.. TGIIC - SBI మధ్య సయోధ్య కుదరడం లేదు.

దిశ, వెబ్‌డెస్క్ : భాగ్యనగరంలోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి 5.09 ఎకరాలు వేలంపై.. TGIIC - SBI మధ్య సయోధ్య కుదరడం లేదు. ఆ భూమిని 2010లోనే రూ.13.33 కోట్లకు కొన్నామని, ప్రభుత్వం వేలం వేసిన భూమిలో కొంతభాగం తమదేనని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. మే 28న సర్వే నంబర్ 83/1లో ఉన్న ప్రభుత్వ భూములను వేలం వేయగా.. గౌరా వెంచర్స్ ఎకరం భూమిని రూ.237 కోట్ల చొప్పున వేలంలో దక్కించుకుంది. ఈ వేలం దేశంలోనే సంచలనం సృష్టించింది.
రెండ్రోజుల క్రితమే ఆ ఐదు ఎకరాలు మావేనంటూ SBI హైకోర్టు వెళ్లి.. ప్రభుత్వానికి షాకిచ్చింది. దీంతో SBI తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. భూముల వేలంలో SBIనే నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపిసోంది. భూముల వేలంపై తలెత్తిన వివాదంతో.. బ్యాంకుతో ప్రభుత్వానికి ముడిపడి ఉన్న ఆర్థిక సంబంధాలపై పునః సమీక్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. SBIలో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాల వివరాల సేకరణ, ప్రభుత్వ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చే అంశాలపై పునరాలోచిస్తున్నట్లు సమాచారం.






