- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Niranjan Reddy : రేవంత్ జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) మీద సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన అనుచితం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Former Minister Niranjan Reddy).

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) మీద సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన అనుచితం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Former Minister Niranjan Reddy). సీఎం రేవంత్ రెడ్డి అధికారం కోసం ఇచ్చిన హామీలు అమలు చేతగాక ప్రజల ముందు జీరో అయ్యాడని, హామీలు అమలు కాకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని మండిపడ్డారు. అనుకోకుండా వచ్చిన అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీ(BJP)తో అంటకాగుతున్నాడని, దీంతో రేవంత్ వ్యవహారశైలి నచ్చక అధిష్టానం దగ్గరకు రానివ్వడం లేదని అన్నారు. ఈ ప్రస్టేషన్ లో అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, పెద్దవారిని తిడితే పెద్దగ ఐపోతానని రేవంత్ భావిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాక్షేత్రంలో రేవంత్ జీరో అని.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి పోయిందని, ఇప్పటికైనా రేవంత్ జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ప్రజలు వెంటిలేటర్ మీద పడుకోబెట్టారని, తులసీతీర్దం పోసే సమయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 15 నెలల కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం అయినట్లేనని, మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే దింపుడుకల్లెం ఆశలేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అడ్డగోలు మాటలు మాని ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి సారిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని నిరంజన్ రెడ్డి హితవు పలికారు.






