రాష్ట్రంలో రేషన్ షాపులు బంద్?

by Naga Rani Yarlagadda |

తెలంగాణలో రేపటి నుంచి రేషన్ షాపులు (Ration Shops Close) మూతపడనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో రేషన్ షాపులు బంద్?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రేపటి నుంచి రేషన్ షాపులు (Ration Shops Close) మూతపడనున్నట్లు తెలుస్తోంది. రేషన్ డీలర్ల సంఘం ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లకు ఎలాంటి స్పందన లేకపోవడంతోనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడిచిన 5 నెలల్లో తమకు అందాల్సిన కమిషన్ అందకపోవడంతో పాటు.. డీలర్లు ఈ నిర్ణయానికి వచ్చారు. సోమవారం 33 జిల్లాల్లో కలెక్టర్లకు తమ డిమాండ్లపై వినతిపత్రాలను కూడా సమర్పించారు. డీలర్లకు కనీస గౌరవవేతనం రూ.5 వేలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు.. డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు, దుకాణాల అద్దె, బియ్యం రవాణా ఖర్చుల్ని ప్రభుత్వమే భరించాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అక్టోబర్ నెల రేషన్ ను పంపిణీ చేయకుండా షాపులు మూసివేయాలని డీలర్ల సంఘం ఫిక్సైనట్లు తెలుస్తోంది. అయితే ఈ రేషన్ షాపుల బంద్ ఒక్కరోజేనా ? లేక నిరవధికంగా చేస్తారా అన్నదానిపై రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Next Story