పదేళ్లలో తగ్గిన రేషన్ కార్డులు.. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 6 లక్షల కార్డుల జారీ

by Kema Shiva Kumar |

తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య తగ్గింది.

పదేళ్లలో తగ్గిన రేషన్ కార్డులు.. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 6 లక్షల కార్డుల జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య తగ్గింది. గత బీఆర్ఎస్​ప్రభుత్వం పదేండ్లలో 6 లక్షల కొత్త కార్డులు ఇచ్చామని చెబుతున్నా.. ఇచ్చిదాని కంటే తీసేసిన కార్డుల సంఖ్యే ఎక్కువగా ఉందని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 91,84,991 కార్డులుండగా ప్రస్తుతం అవి 90,41,953కు చేరాయి. అంటే పదేళ్ల కిందటికి ఇప్పటికి 1.43 లక్షల కార్డులు తగ్గాయి. అదే సమయంలో బీఆర్ఎస్​ఇచ్చామని చెబుతున్న 6 లక్షల కొత్త కార్డులు కలిపితే ఇంకా ఎక్కువ సంఖ్యలో కార్డులు ఉండాలి. కానీ, పెద్ద ఎత్తున కార్డుల సంఖ్య తగ్గాయి. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలోని పది జిల్లాల పరిధిలో ఉన్న తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 91,84,991 కాగా 2025 మార్చి చివరి నాటికి ఉన్న తెల్ల కార్డుల సంఖ్య 90,41,953 మాత్రమే.

రాష్ట్రం ఏర్పడే నాటికి ఇప్పటికీ ఉన్న తెల్ల రేషన్ కార్డుల సంఖ్య దాదాపు లక్ష 43 వేలు తగ్గాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డుల సంఖ్యను పరిశీలిస్తే 2016-2021 సంవత్సరాల మధ్యలో తెల్ల రేషన్ కార్డుల కోసం 9,52,806 దరఖాస్తులు రాగా అందులో 6,70,996 మందికి కార్డులు మంజూరు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. 6 లక్షల పైగా రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత 2021 సెప్టెంబర్ నాటికి ఉన్న మొత్తం రేషన్ కార్డుల సంఖ్య పరిశీలిస్తే 90,49,480 మాత్రమే 2022లో కూడా దాదాపు ఇదే సంఖ్య కొనసాగింది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కార్డుల కంటే తీసేసినవే ఎక్కువ కావడం వల్లే మొత్తం రేషన్ కార్డుల సంఖ్య పెరగకపోగ తగ్గాయి.

రాష్ట్రంలో నాలుగు లక్షల తెల్ల కార్డులు తొలగించిన సందర్భంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని తొలగించిన కార్డులను తిరిగి సర్వే నిర్వహించి అర్హులందరికీ తిరిగి పునరుద్ధరించాలని గత ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేసింది. దీంతో మరోసారి కార్డులను పరిశీలించి అర్హులకు కార్డులను కొనసాగించారు. రాష్ట్రంలో ప్రతి నెల తెల్ల రేషన్‌కార్డు అప్లై, సరఫరా అవుతున్న బియ్యం 1.70 లక్షల టన్నులు ఏడాదికి 20.40 లక్షల టన్నులు అవుతుంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో ఆ ఏడు 11.58 లక్షల టన్నులు సరఫరా కాగా 2015లో 21 లక్షల టన్నులకు పెరిగి ఆ తర్వాత కొంత తగ్గి సరాసరి ప్రతి సంవత్సరం 20 లక్షల టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి.

Next Story